Annavaram Temple: తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. దేవస్థానంలో పలు అక్రమాలు జరిగాయని, నిబంధనలు పాటించడం లేదని దేవస్థానానికి చెందిన ధర్మకర్తల మండలి సభ్యుడొకరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో విజిలెన్స్ ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, సిబ్బంది బృందం రికార్డులు పరిశీలించి వివరాలు సేకరించారు.
లీజులు, బకాయిల వసూలు, అభివృద్ధి పనులు నాణ్యత, అంచనాలు పెంచడం, ఉద్యోగుల నియామకం, పదోన్నతులు, సరకుల కొనుగోలు ఇలా సుమారు 25 అంశాలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దేవస్థానం ఛైర్మన్ అర్హతపైనా మరో ఫిర్యాదు అందడంతో ఆయా అంశాలపై అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి:
CM Jagan On Paddy Procurement: ధాన్యం కొనుగోళ్లలో వారి పాత్ర ఉండొద్దు: సీఎం జగన్