లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు 100 రూపాయలకే 5 రకాల పండ్ల కిట్, 7 రకాల కూరగాయల కిట్ పంపిణీ కార్యక్రమం జిల్లాలో ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. ఉద్యానవన శాఖ, మార్కెటింగ్ శాఖ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో రోజుకు 1000 కుటుంబాలకు ఈ కిట్లు అందించే కార్యక్రమం చేపడుతున్నామనీ, భవిష్యత్తులో 10 వేల కుటుంబాలకు అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జేసీ లక్ష్మీషా వివరించారు.
ఇదీ చదవండి: నిరుపేదలు, నిరాశ్రయులకు వ్యాపారవేత్త అన్నదానం