తూర్పుగోదావరి జిల్లాలోని అంతర్వేది-పల్లిపాలెం వశిష్ఠ గోదావరి సంగమం సమీపంలో కొందరు పిల్లలు మంగళవారం వేటాడుతుండగా చిరుత పులిచారలు కలిగిన పాము చేప చిక్కింది. 3 అడుగుల పొడవు, 4 కిలోల బరువు కలిగిన దీన్ని చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది ఈల్డ్ చేప వర్గానికి చెందినదని, ఇలాంటి రంగుల చారల పాము చేపలు విషపూరితమైనవని ఎఫ్‌డీవో సంజీవరావు తెలిపారు. ఇవి ఎక్కువగా ఇతర దేశాల్లో, సముద్రంలో రాళ్లు ఉండే ప్రదేశాల్లో సంచరిస్తుంటాయని తెలిపారు.
ఇదీ చదవండి: ఈ తల్లి 14 ఏళ్లుగా కొడుకును మోస్తూనే ఉంది..!