కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నట్లు.. ఆలయ ఈవో ముదునూరు సత్యనారాయణ రాజు తెలిపారు. గోదావరి జలాలను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేసి ఉత్సవాలను ప్రారంభించారు. 9, 10, 11 తేదీల్లో గురుడ, హంస, సింహ వాహన సేవలను, 12 గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ.. సినిమా టికెట్ల ధరలు పెంచితే కఠిన చర్యలే..!