తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు భక్తులను అనుమతించడం లేదు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22 నుంచి 28 వరకు ఉత్సవాలు జరగనున్నాయి.
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా స్వామివారికి ఏకాంతంగానే కల్యాణ మహోత్సవాలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. భక్తులు గమనించాలని కోరారు.
ఇదీ చదవండి: