తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం వాడపల్లిలోని వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఏడాది పొడవునా నిర్వహించే కైంకర్యాలు, ఉత్సవాల్లో తెలిసి తెలియక నెలకొనే దోషాల నివారణకు ఉత్సవాలు నిర్వహించడం, ఆనవాయితీగా వస్తుందని వేదపండితులు తెలిపారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ఆలయ ప్రదక్షణ, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలను ఆలయంలో ఏర్పాటు చేశారు. 12వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు, ఈ మూడు రోజులపాటు ఆలయంలో కళ్యాణాలు, అష్టోత్తర పూజలు రద్దు చేసినట్లు ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన వేదనపత్తి సతీష్ కుమార్ కామాక్షి దంపతులు 2 లక్షల 50 వేల విలువైన 9 వెండి బిందెలను... రావులపాలంకి చెందిన వీర్రెడ్డి కుటుంబ సభ్యులు లక్షా 40 వేల విలువైన బంగారు ఆభరణాలను స్వామివారికి బహుకరించారు.
ఇది చూడండి: ప్రమాదకర అడవిలో మోదీ ఏం చేశారంటే...!