తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన న్యాయవాది సుభాష్‌చంద్రబోస్ అదృశ్యం కేసుకు సంబంధించి ఏలేశ్వరం ఎస్సై సుధాకర్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.
న్యాయవాది సుభాష్‌చంద్రబోస్‌ను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, ఏలేశ్వరం పోలీసులు అర్ధరాత్రి దాటాక తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వచ్చి అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారంటూ ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై బోస్ భార్య పి.వెంకటప్రియదీప్తి ఇటీవల హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి.. హైకోర్టులో హాజరు కావాల్సి వచ్చింది. బోసును తమ ముందు హాజరుపర్చాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
పోలీసులు మాత్రం న్యాయవాది సుభాష్ చంద్రబోస్‌ను అదుపులోకి తీసుకోలేదని చెబుతున్నారు. కేసు విచారించిన ఏలూరు రేంజ్ డీఐజీ... ఎస్సై సుధాకర్‌ను సస్పెండ్ చేశారు. అతనితో పాటు రాజమహేంద్రవరం త్రీటౌన్ ఎస్సై హరిబాబుపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. మరో ఇద్దరు సీఐలు, ఒక ఎస్సైకి ఛార్జి మెమోలు జారీ చేశారు.
ఇదీ చదవండి