తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురులోని అరుంధతి పేటలో దారుణం చోటుచేసుకుంది. భూమి సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు కుటుంబాల వారు కత్తులు కర్రలతో దాడి చేసుకున్నారు.
ఈ గొడవలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: రూ. 20 వేలు పలికిన పులస.. తగ్గేదేలే అంటున్న జనం..!