తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం వజ్రకూటం వద్ద కంపెనీ నిర్మాణంలో భాగంగా తాగునీటి కోసం రిగ్తో బోర్ కొడుతూ విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుల కుటుంబసభ్యులను ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే పర్వతప్రసాద్ పరామర్శించారు. ప్రాణాలు కోల్పోయిన యువకుల కుటుంబాలకు యాజమాన్యం చెరో కోటి రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రత్తిపాడు పీహెచ్సీ ఎదుట ధర్నాకి దిగారు.
ఇదీ చూడండి