తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం కినపర్తి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో విశాఖ జిల్లాకు చెందిన ఆదివాసీలు గత ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. అటవీశాఖ హద్దుల్లో ఉండకూడదంటూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని రాజవొమ్మంగి రేంజ్ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాము తాగడానికి వినియోగించే చేతిపంపును ధ్వంసం చేసి అటవీ అధికారులు తమను గాయపరిచారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అడ్డతీగల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
ఖాళీ చెయ్యాలని ఖాకీ దెబ్బలు - కినపర్తిలో ఆదివాసీల ఆందోళన
తాము ఆరేళ్లుగా నివాసం ఉంటున్న అటవీ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని రాజవొమ్మంగి రేంజ్ అధికారులు హెచ్చరించారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తాగడానికి వినియోగించే చేతిపంపును ధ్వంసం చేసి తమను గాయపరిచారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం కినపర్తి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో విశాఖ జిల్లాకు చెందిన ఆదివాసీలు గత ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. అటవీశాఖ హద్దుల్లో ఉండకూడదంటూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని రాజవొమ్మంగి రేంజ్ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాము తాగడానికి వినియోగించే చేతిపంపును ధ్వంసం చేసి అటవీ అధికారులు తమను గాయపరిచారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అడ్డతీగల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: గిరిజనులు మనుషులు కాదా..ఈ సరకులు తినేదెలా..?