తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం ఓఎన్జీసీ సంస్థ 20 లక్షలతో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించింది.వాటి ప్రారంభోత్సవానికి ఓఎన్జీసీ ప్రతినిధి పార్థబన్,ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సంధర్బంగా 8 మరగుదొడ్లను వారు ప్రారంభించారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయటమే తమ ధ్యేయమని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు.
ఇదీచదవండి