తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని రథంగుడి ఆవరణలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ఉన్న హుండీలోని డబ్బు చోరీకి గురైంది. ఆదివారం రాత్రి వరకు బాగానే ఉన్న హుండీ ఇవాళ ఉదయానికి ధ్వంసమై కనిపించింది. దీంతో ఆంజనేయస్వామి విగ్రహ నిర్వహణ కమిటీ సభ్యులు మండపేట టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బందితో కలిసి సీఐ అడపా నాగ మురళీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ పుటేజీని పరిశీలించగా ముగ్గురు యువకులు మోటారు సైకిల్‌పై వచ్చి హుండీలో సొమ్ము దొంగిలించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దీని ఆధారంగా నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు.
ఇదీ చూడండి: వివేకా హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై సీబీఐ ఆరా