తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మొండేపులంక సమీపంలో పంట కాలువలో బీహార్‌కి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. ఘటనపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన స్థలిలోనే ఉన్న రేనా దేవి అనే మహిళను పోలీసులు విచారణ చేయగా... గల్లంతైన వారు రేనా దేవి భర్త, అత్త, అమ్మగా గుర్తించారు. తన వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా వీరు బీహార్‌కు చెందిన వారుగా గుర్తించారు.
ఇవీ చదవండి