ETV Bharat / state

చిరుతలా దాడి చేస్తారు... ఉగ్రమూకలకు దడ పుట్టిస్తారు! - ప్రకాశం జిల్లా పోలీసులు తాజా వార్తలు

ఉగ్ర సవాళ్లను గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ఆర్మీ దళాలు సమర్థవంతంగా ఎదుర్కోగలవు. అయితే వారికి మేం తీసిపోం అంటోంది ప్రకాశం జిల్లాలోని 'స్వాట్'. పోలీసు శాఖలోని మెరికిల్లాంటి యువకులను ఎంపిక చేసి ఈ బృందాన్ని రూపొందించారు. ఈ స్వాట్​లోని సభ్యులు అత్యాధునిక ఆయుధాలను అలవోకగా వినియోగించగలరు. మెరుపులా కదులుతూ అరాచక శక్తుల తాట తీసే సత్తా వీరి సొంతం.

SWAT
SWAT
author img

By

Published : Jan 9, 2021, 4:27 PM IST

Updated : Jan 9, 2021, 4:46 PM IST

చిరుతలా దాడి చేస్తారు... ఉగ్రమూకలకు దడ పుట్టిస్తారు!

శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసు శాఖ పాత్ర కీలకం. అయితే సంఘ విద్రోహుల వల్ల అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వీరు చేతులెత్తేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు తుపాకి వినియోగంపై ఏడాదికి ఒకటి, రెండు సార్లు మాత్రమే శిక్షణ తీసుకుంటారు. సరిహద్దుల్లోని సైనికుల్లా వీరు వేగంగా స్పందించలేరు. అందుకే ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ స్పెషల్‌ వెపన్‌ అండ్‌ టాక్టిక్స్ (స్వాట్‌) బృందాన్ని తయారు చేశారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌, ఆర్మీ సిబ్బందికి తీసిపోని విధంగా వీరిని తీర్చిదిద్దారు.

కఠిన శిక్షణ

ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో పని చేస్తున్న మెరికల్లాంటి 33 మంది యువకులను స్వాట్​కు ఎంపిక చేశారు. వీరికి విశ్రాంత ఆర్మీ అధికారులతో కఠినతరమైన శిక్షణ ఇప్పించారు. కిడ్నాప్​న​కు గురైన వీఐపీలను రక్షించడం, ఉగ్రవాదులు ఏదైన భవనాన్ని, ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే వారిని అక్కడ నుంచి తరిమివేయడం, వాహనాలల్లో తప్పించుకుంటే వారిని వెంబడించి పట్టుకోవడం... ఇలా క్లిష్టమైన పరిస్థితుల్లో చాకచక్యంగా పనిచేసే విధంగా వీరికి శిక్షణ ఇచ్చారు. ఇందులో ఇన్​స్పెక్టర్, సబ్ ఇన్స్​పెక్టర్, కానిస్టేబుల్‌ స్థాయి ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారు. రోజూ వీరికి కఠిన శిక్షణ , ప్రతి వారం రైఫిల్‌ ట్రెయినింగ్‌ ఇస్తుంటారు. తుపాకీలను సునాయాసంగా వినియోగించడం, తుపాకీ భాగాలను విడగొట్టి, తిరిగి సిద్ధం చేయడం కూడా వీరి నైపుణ్యానికి నిదర్శనం.

రాష్ట్ర స్థాయిలో గుర్తింపు

పోలీసు శాఖలో ఒకే తరహా బాధ్యతలు చేపట్టడం వల్ల ఏ ఆశయంతో ఈ వృత్తిలోకి వచ్చామో అది నెరవేరడం లేదు. స్వాట్‌ టీమ్‌లో పని చేయడం వల్ల మా ఆశయాలు నెరవేరుతున్నాయి. ఎలాంటి పరిస్థితులను అయినా ధైర్యంగా ఎదుర్కోడానికి ఉన్నత అధికారులు తగిన శిక్షణ ఇచ్చారు అంటున్నారు స్వాట్ బృందంలోని సభ్యులు. స్వాట్​కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ బృందాన్ని పలుసార్లు అభినందించారు. పోలీసు శాఖలో యువతరానికి వీరు స్ఫూర్తిగా నిలుస్తారని పలువురు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి

చైనా జవానును అదుపులోకి తీసుకున్న సైన్యం

Last Updated : Jan 9, 2021, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.