రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయ భూములు లాక్కొని ప్రైవేట్ సంస్థలకు, అధికార పార్టీ ఎంపీలకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆరోపించారు. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి(సాహిత్య పీఠం) చెందిన 20 ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత హైదరాబాద్ కేంద్రంగా నడిచే 5పీఠాల విభజన జరగలేదని, ఈ పరిస్థితిలో భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అలాగే అమ్మబడి ద్వారా మేనమామని అవుతానన్న జగన్... కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో మేనమామ చందా తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే రూ.868 కోట్లు ఈ విధంగా వసూలు చేశారని విమర్శించారు.
'వర్సిటీ భూముల కబ్జాకు వైకాపా కుట్ర' - పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భూములు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన భూములను ప్రభుత్వం తీసుకోవడం అంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల భూములను కాపాడుకోవడానికి టీఎన్ఎస్ఎఫ్ పోరాటం చేస్తుందని వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయ భూములు లాక్కొని ప్రైవేట్ సంస్థలకు, అధికార పార్టీ ఎంపీలకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆరోపించారు. అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి(సాహిత్య పీఠం) చెందిన 20 ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత హైదరాబాద్ కేంద్రంగా నడిచే 5పీఠాల విభజన జరగలేదని, ఈ పరిస్థితిలో భూములు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అలాగే అమ్మబడి ద్వారా మేనమామని అవుతానన్న జగన్... కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో మేనమామ చందా తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికే రూ.868 కోట్లు ఈ విధంగా వసూలు చేశారని విమర్శించారు.
ఇదీ చదవండి
TAGGED:
tnsf ap news