ఆసుపత్రిలో అనాథ శిశువు ఐసీడీఎస్ అధికారులకు అప్పగింత - orphaned baby in chollangi
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు రెండు నెలలుగా చికిత్స పొందుతున్న అనాథ శిశువును వైద్యులు శిశుసంరక్షణ సిబ్బందికి అప్పగించారు. గత సంవత్సరం డిసెంబరు 4న తాళ్లరేవు మండలం చొల్లంగిలో తుప్పల్లో వదిలేసిన ఆడ శిశువును.. స్థానికులు గుర్తించి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. తక్కువ బరువుతో పుట్టిన పాపకి వైద్యులు చికిత్స అందించారు. ఇప్పుడు శిశువు పూర్తి ఆరోగ్యంగా ఉండటంతో.. జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎం.రాఘవేంద్రరావు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.
అనాథ శిశువును శిశుసంరక్షణ సిబ్బందికి అప్పగించిన వైద్యులు