రైతు భరోసా కార్యక్రమంపై తూర్పుగోదావరిజిల్లా రావులపాలెం మండల కార్యాలయంలో పంచాయతీరాజ్ రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూమి ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు సైతం ఈ పథకం అమలు చేస్తున్న నేపథ్యంలో వారిని గుర్తించి పేర్లు నమోదు చేయాలని సూచించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులకు గ్రామాల వారీగా లబ్ధిదారుల పేర్లు అందించారు. వాటిపై సర్వే చేయాలని సూచించారు. .
ఇదీ చదవండి:సుప్రీంలో నలుగురు నూతన న్యాయమూర్తుల నియామకం