ETV Bharat / state

అరటి రైతులకు తప్పని కష్టాలు - banannna farmers difficulites due to carona

అరటి రైతులకు కష్టాలు తప్పడం లేదు. కరోనా ప్రభావం ఈ ఏడాది పంటపై పడింది. ఏటా ఈ కాలంలో అరటి గెల రూ.350 వరకూ పలికేది. ప్రస్తుతం ఎగుమతులు తగ్గిపోవడంతో గెలకు రూ.100 కూడా దక్కని పరిస్థితి.

east godavari district
అరటి రైతులకు తప్పని కష్టాలు
author img

By

Published : Apr 15, 2020, 12:28 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యాన శాఖ అధికారుల లెక్కల ప్రకారం 12,668 హెక్టార్లలో రైతులు అరటిని పండిస్తున్నారు. ప్రభుత్వపరంగా రావులపాలెం, అంబాజీపేటలో మార్కెట్‌ యార్డులున్నాయి. రావులపాలెం మార్కెట్‌ యార్డు నుంచి నిత్యం 25 వేల గెలలను తమిళనాడు, బిహార్‌, ఒడిశా, తెలంగాణ (హైదరాబాద్‌), కర్ణాటక రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. లాక్‌డౌన్‌తో రవాణా వ్యవస్థ స్తంభించి అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. మొదట్లో అరటి మార్కెట్‌ యార్డులను మూసేశారు. ఆ తరువాత భౌతిక దూరం పాటిస్తూ యార్డులను తెరిచారు. స్థానిక వ్యాపారులు మాత్రమే యార్డులకు వస్తున్నారు. ప్రస్తుతం 5 వేల నుంచి 7 వేల గెలలు మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి.

కర్పూర పరిస్థితి దారుణం

దేవాలయాలు, శుభకార్యాలకు ఎక్కువగా కర్పూర అరటి ఉపయోగిస్తారు. కరోనా ప్రభావంతో శుభకార్యాలు లేకపోవడం, ఆలయాలు మూసివేయడంతో కర్పూర గెలలను కొనేనాథుడే లేడు. వేసవి తాపంతో గెలలు తోటల్లోనే మగ్గిపోతున్నాయి. యార్డుకు తెచ్చినా విక్రయాలు పూర్తిస్థాయిలో జరగక కొందరు రైతులు అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. ఎర్ర చక్కెరకేళి అరటి కేవలం తమిళనాడుకు మాత్రమే ఎగుమతులు జరిగేవి. ఆ రాష్ట్రం దిగుమతులు నిలిపివేయడంతో ఒక్క గెల కూడా కదలని పరిస్థితి.

యార్డుల్లోనే విక్రయాలు

ఎకరం పంటలో సుమారుగా 700 అరటి మొక్కలు వరకు వేస్తారు. రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడులు అవుతాయి. ప్రస్తుత తరుణంలో కనీసం పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు. నాలుగు రోజుల క్రితం ఈదురు గాలుల కారణంగా అరటి పంట నేలకొరిగింది. కడప జిల్లాలో భుషావళి అరటిని యార్డు అధికారులు టన్ను రూ.3,500కు కొనుగోలు చేస్తున్నారు.

ఈ విధమైన కొనుగోళ్లు ఈ ప్రాంతంలో కుదరవని, ఇక్కడ అరటి టన్ను రూ.12 వేల నుంచి రూ.16 వేలు వరకూ పలుకుతుందని రైతులు చెబుతున్నారు. పదిరోజుల కిందటి వరకు చక్కెరకేళి అరటి టన్ను రూ.16 వేలు పలకగా ప్రస్తుతం రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం ధరలు లేక ఇబ్బందుల్లో ఉంటే ఈదురు గాలులతో అరటి పంటపై మరో పిడుగు పడింది. జిల్లాలోని 213 హెక్టార్లలో 5,333 టన్నుల పంట దెబ్బతిన్నట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనా వేశారు.

చర్యలు తీసుకుంటున్నాం

ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు అరటి ఎగుమతులు జరుగుతున్నాయి. యార్డులో సామాజిక దూరం పాటిస్తూ రైతులు గెలలను విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని రావులపాలెం మార్కెట్‌ యార్డు కార్యదర్శి తెలిపారు. కరోనా ప్రభావంతో డిమాండ్‌ లేక ధరలు తగ్గాయ అన్నారు. రైతులే నేరుగా విక్రయించుకుంటున్నారు.. ప్రభుత్వపరంగా మేం ఎటువంటి కొనుగోళ్లూ చేయడం లేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు వ్యక్తులు డిశ్చార్జ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.