వైకాపా ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించటం సరైనది కాదని భాజపా నేత పురందేశ్వరి వ్యాఖ్యానించారు. రాజమహేంద్రవరంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం సరైన పాత్ర పోషించటం లేదని పురందేశ్వరి విమర్శించారు. వైకాపాతో పొత్తు విషయాన్ని ప్రస్తావిస్తూ... ఈ అంశంపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ వైకాపాతో పొత్తు పెట్టుకోదని జనసేనతో కలిసి పనిచేస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: