తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీవిశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 120 వ మహాసభలు మూడో రోజు ఘనంగా జరిగాయి. భవిష్యత్తులో కృత్రిమ మేధాశక్తి మరింత వేగవంతం కాబోతోందని ఆ మేధాశక్తికి ఆధ్యాత్మికత జోడించి లోక కళ్యాణానికి ఉపయోగించాలని పీఠాధిపతి ఉమర్ అలీషా చెప్పారు. ఆధునిక సమాజంలో మానవుడు ప్రతీక్షణం ఆందోళన, ఒత్తిడికి లోనవుతున్నాడని.. ఆధ్యాత్మికత అలవర్చుకోవాలని సూచించారు. కులమతాలకు అతీతంగా మనిషి మనుగడ సాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతీ ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని ఆలీషా పిలుపునిచ్చారు. అనంతరం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ద్వారా నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు.
ఇదీ చూడండి: