ETV Bharat / state

విద్యార్థుల కుటుంబాలకు చేయూత.. రూ.10 లక్షల నిత్యావసరాలు అందజేత - విద్యార్థుల కుటుంబాలకు నిత్యావసరాలు అందించిన టీచర్లు

కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉపాధి లేక పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరుపేద కుటుంబాలు పనుల్లేక..పస్తులుంటున్నారు. తమ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆకలితో ఉంటున్నారని గమనించిన కొందరు ఉపాధ్యాయులు చేయి చేయి కలిపారు. తమ వంతు సాయంగా రూ.10 లక్షల విలువైన నిత్యావసరాలు అందజేశారు.

విద్యార్థుల కుటుంబాలకు చేయూత.. రూ.10 లక్షల నిత్యావసరాలు అందజేత

author img

By

Published : Jul 21, 2020, 6:11 PM IST

తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో 17 ప్రాథమిక పాఠశాలలు, 8 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 3500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో దాదాపు 250 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పాఠశాలలు జరిగే సమయంలో పిల్లలకు ఉదయం పాలు, బిస్కెట్లు.. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఒక పూట పౌష్టికాహారం అందించేవారు. కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడడంతో...విద్యార్థులపై ఆ ప్రభావం పడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దాతలు చేసిన సాయంతో విద్యార్థుల కుటుంబాలు రెండు నెలలు ఎలానో నెట్టుకొచ్చాయి. కానీ కరోనా ఉద్ధృతి పెరుగుతుండడంతో పనుల్లేక వారి సమస్యలు అధికమయ్యాయి.

సమస్య గుర్తింపు ఇలా

యానాం డిప్యూటీ కలెక్టర్ శివరాజ్మీనా ఆదేశాల మేరకు కరోనా బాధితులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు.. తమ పాఠశాలలో చదివే విద్యార్థుల కుటుంబాల ఆర్థిక పరిస్థితిని గుర్తించారు. విద్యార్థుల కుటుంబాల పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులంతా సమావేశమై వారిని ఆదుకోవాలని నిర్ణయించారు.

రూ.10 లక్షల నిత్యావసర సరకులు

ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళశాలలు, ఐ.టి.ఐ, పాలిటెక్నిక్..ఇలా అన్ని విద్యా సంస్థలలో పనిచేసే బోధన సిబ్బంది సహకారంతో రూ.10 లక్షలు సమకూర్చారు. ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనికి.. స్థానిక శాసనసభ్యుడు, పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు.. ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ నగదుతో సుమారు 3500 కుటుంబాలకు ఆరు రకాల నిత్యావసర సరకులను దశలవారీగా ప్రతి పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులకు అందించే ఏర్పాటుచేశారు. స్థానిక కురసాంపేట పాఠశాలలో మంత్రి మల్లాడి కృష్ణారావు విద్యార్థుల తల్లిదండ్రులకు నిత్యావసర సరకులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కుటుంబాలను ఆదుకునేందుకు ఉపాధ్యాయులంతా ముందుకు రావడం అభినందించదగిన విషయమని మల్లాడి కృష్ణారావు అన్నారు.

ఇదీ చదవండి : 'సీఎం అసమర్థత వల్ల కరోనా విజృంభిస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.