ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాల్లో 91.91 శాతం పోలింగ్ నమోదైంది. రెండు జిల్లాలో మొత్తం 17,467 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా.. 16,054 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 7 పోలింగ్ కేంద్రాల్లో నూరు శాతం ఓటింగ్ నమోదైంది. అమలాపురం డివిజన్లో 94 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ డివిజన్లో 16 మండలాల్లో ఏర్పాటు చేసిన 16 పోలింగ్ కేంద్రాల్లో 2 వేలకు పైగా ఓటర్ల తమ హక్కును వినియోగించుకున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పెట్టెలను కాకినాడ జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూంకి తరలించారు. ఈ నెల 17న ఉదయం 7 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: