తూర్పుగోదావరి, విశాఖ జిల్లా సరిహద్దుల్లో లేటరైట్ తవ్వకాలను (Laterite Digging) పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా బృందాన్ని(tdp team) పోలీసులు అడ్డుకున్నారు. మీడియా సమావేశం నిర్వహించేందుకు నేతలు ప్రయత్నించగా.. రౌతులపూడిలో పోలీసులు అడ్డు చెప్పారు. మన్యంలో లేటరైట్ తవ్వకాల వివరాలను స్థానిక గిరిజనులను అడిగి నేతలు తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణలో తమ పొలాలు, చెట్లు నష్టపోయామని గిరిజనుల ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం లేటరైట్ తరలింపునకే మన్యంలో రోడ్లు వేశారని తెదేపా బృందం ఆరోపించింది.
తూర్పుగోదావరి జిల్లా జల్దామ్ నుంచి విశాఖ జిల్లా సిరిపురం వరకు రోడ్డు విస్తరణ చేపట్టారని నేతలు ఆక్షేపించారు. రిజర్వు ఫారెస్టులో నిబంధనలకు విరుద్ధంగా రోడ్డు వేశారన్నారు. లేటరైట్ ముసుగులో బాక్సైట్ తవ్వకాలకు జగన్ ప్రభుత్వం తెరలేపిందని మండిపడ్డారు. పోలీసులు మీడియా సమావేశాన్ని అడ్డుకోవటంతో తెదేపా నేతలు నిరసనకు దిగారు.
రౌతులపూడి ఘటనపై పార్టీ నేతలతో చంద్రబాబు (chandra babu) మాట్లాడారు. అయ్యన్నపాత్రుడు, చినరాజప్పతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గిరిజన, అటవీ భూముల్లో రోడ్లు వేసిన వైనంపై చంద్రబాబు ఆరా తీశారు.
ఇదీ చదవండి