తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చిన శంకర్లపూడి గ్రామానికి చెందిన తెదేపా బీసీ నాయకుడు ఏపూరి శ్రీనివాస్ బెయిల్ పై విడుదల అయ్యారు. ఎస్సైపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై 10 రోజుల క్రితం అరెస్టు అయిన శ్రీనివాస్.. బెయిల్‌పై విడుదల అయ్యారు. శ్రీనివాస్‌కు మద్దతుగా.. చిన్నశంకర్లపూడిలో గ్రామస్థులు, తెదేపా శ్రేణులు రోడ్ పై బైఠాయించారు. ఎస్సై రవికుమార్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో శ్రీనివాస్‌కు సంఘీభావంగా తెదేపా శ్రేణులు ఆయన ఇంటికి చేరుకొన్నారు. ఎస్సై రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని తెదేపా శ్రేణులు డిమాండ్ చేశారు. బీసీలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని వరుపుల రాజా ఆరోపించారు.
ఇదీ చదవండి: దేశంలో 24 గంటల్లో 13,586 కరోనా కేసులు