TDP Leaders Comments in Mahanadu: వైఎస్ వివేకా హత్య కేసు సీఎం జగన్ చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. దీనిని ఎవరూ ఆపలేరని అన్నారు. సీబీఐ లాంటి అతి పెద్ద నేర పరిశోధన సంస్థ అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతోందని అన్నారు. హత్యారాజకీయాలకు కేంద్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనమంతా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని కాపాడుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మంచి మనస్సుతో చెప్పారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పిన పవన్ కల్యాణ్ కామెంట్లతో జగన్‌కు నిద్ర పట్టడం లేదన్నారు. ఎన్టీఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ జెండాలు కడతారా అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు.
జగన్ క్షమాపణ కోరాలి: జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న.. వైఎస్ వివేకా ఆత్మ క్షోభ మంత్రులకు వినిపించట్లేదా అంటూ మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. బాబాయ్‌ని చంపిన అబ్బాయి తీరు చూసి వైఎస్సార్ ఆత్మ కూడా క్షోభిస్తోందన్నారు. ఇప్పటికైనా సిగ్గు ఉంటే వైఎస్సార్ సమాధి వద్దకు వెళ్లాలని అన్నారు. పదవి కోసం బాబాయిని చంపినందుకు తప్పైపోయిందని.. వైఎస్సార్ సమాధి వద్ద క్షమాపణ చెప్పాలన్నారు.
చిన్నాన్నను చంపిన ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి నిలవబోతున్నాడని నిన్నటి సీబీఐ వాదనతో స్పష్టమైందని బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. మహానాడు స్పందన చూసి ఓర్వలేక మంత్రులు అప్పుడే విమర్శలకు దిగారని మండిపడ్డారు. వంచన మేనిఫెస్టోతో ప్రజల్ని మోసగించి.. టీడీపీ మేనిఫెస్టోపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
మేనిఫెస్టోలో సంపూర్ణ మద్యపాన నిషేదం అని ఇంతవరకూ ఎందుకు చేయలేదని విమర్శించారు. నిరుద్యోగ యువతను మోసం చేశారని, ఉద్యోగులు సమస్యలు పరిష్కరించాలని ధర్నాలు చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా హామీ ఏమైందని ప్రశ్నించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఎన్ని ఇళ్లు కట్టాడో జోగి రమేష్ సమాధానం చెప్పగలడా అంటూ బండారు సత్యనారాయణమూర్తి నిలదీశారు.
జగన్ పాలనకు చరమగీతం పాడాలి: పేదల సంక్షేమం కోసం.. అభివృద్ధి కోసం తీర్మానాలు చేస్తున్నామని మాజీమంత్రి ఆలపాటి రాజా తెలిపారు. 1983లో పార్టీ ఆవిర్భావం నాటి సంఘటనలు.. మళ్లీ చూస్తున్నామన్నారు. జగన్ పాలనకు చరమగీతం పాడడానికి రేపటి బహిరంగ సభ దోహదం చేస్తుందని మాజీమంత్రి ఆలపాటి రాజా వ్యాఖ్యానించారు.
మహానాడు వేదికపై నుంచి జారిపడ్డ టీడీపీ నేత: టీడీపీ నేత బీదా రవిచంద్ర యాదవ్ మహానాడు వేదికపై నుంచి జారి పడ్డారు. స్టేజీపై కుర్చీలు వెనుక ఖాళీ గుర్తించక జారి కిందకు పడిపోయారు. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మహానాడు వైద్య శిబిరంలో ప్రాథమిక చికిత్స తీసుకున్న బీదా తిరిగి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి:
- TDP Mahanadu 2023 టీడీపీ శ్రేణులతో పసుపెక్కిన రాజమహేంద్రవరం.. మహానాడు ప్రారంభోపన్యాసంతో హుషారెత్తించిన చంద్రబాబు
- Chandrababu in Mahanadu: "వచ్చే సార్వత్రిక ఎన్నిక ఓ కురుక్షేత్ర సంగ్రామం.. కౌరవుల్ని ఓడించి మళ్లీ గౌరవ సభ నిర్మిద్దాం"
- TDP Mahanadu: పసుపుమయంగా గోదావరి.. తెలుగుదనం ఉట్టిపడేలా మహానాడు.. మేనిఫెస్టోపై దృష్టి పెట్టిన పార్టీ