yanamala: తెదేపాతోనే ప్రజారంజక పాలన సాధ్యమవుతుందని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో నిర్వహించిన గౌరవ సభకు ఆయన హాజరయ్యారు. ఆయనతోపాటు నిమ్మకాయల చిన్నరాజప్ప తదితరులు పాల్గొన్నారు.
వైకాపా పాలనలో గ్రామాల అభివృద్ధి తిరోగమనంలో పయనిస్తోందన్న ఆయన.. ఓటీఎస్ పేరుతో వేలాది రూపాయలను బలవంతంగా వసూలు చేయడం దుర్మార్గమన్నారు. తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధే తప్ప, రెండున్నరేళ్ల వైకాపా పాలనలో జరిగిన అభివృద్ది మచ్చుకైనా కానరావడం లేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: