ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ.. తూర్పుగోదావరి జిల్లా తునిలో తెలుగుదేశం నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏలూరులో అనేక మంది అనారోగ్యం పాలైన కారణంగా ప్రజలకు శుభ్రమైన నీరు అందించాలని పార్టీ నియోజకవర్గ బాధ్యుడు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రదర్శన చేపట్టారు. పురపాలక కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.
ఇవీ చదవండి..