రాష్ట్రంలో తెదేపా నాయకులపై పెడుతున్న కేసులు ఎత్తివేయాలని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వంతల రాజేశ్వరి డిమాండ్ చేశారు. రంపచోడవరంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
వైకాపా తీరుకు రాబోవు రోజుల్లో ప్రజలే బుద్ది చెబుతారని ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అడబాల బాపిరాజు, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, మాజీ సర్పంచ్ నిరంజినీ దేవి, నాయకులు సూర్యనారాయణ రాజు, పాము అర్జున్తో పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: