మాజీ ఎంపీ హర్షకుమార్‌ను అరెస్టు చేయడంపై.. తెదేపా నేతలు మండిపడ్డారు. చింతమనేనిని ఇలానే అక్రమంగా అరెస్టు చేశారని తెదేపా నేత చినరాజప్ప ఆగ్రహించారు. హర్షకుమార్ హైకోర్టులో స్టే తెచ్చుకున్నా.. అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆరోపించారు. రాజధాని అంశంలో రాష్ట్ర భవిష్యత్ దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చినరాజప్ప విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రైతులను, పెట్టుబడులు పెట్టేవారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెదేపా నాయకులు హర్షకుమార్‌ను పరామర్శించారు.
ఇదీ చదవండి: