తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో కరోనా కేసులు పెరగడానికి స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యమే కారణమని తెదేపా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం సంక్షోభ పరిస్థితి నెలకొంటే.. ఎమ్మెల్యే పెళ్లిరోజు వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ తక్షణమే కరోనా టెస్టులు జరిపించాలని డిమాండ్ చేశారు.
లాక్డౌన్ ఉన్నా.. గొల్లలమామిడాడ గ్రామంలో కరోనా వ్యాప్తికి కారణమైన అధికారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ తొలినుంచి కరోనాపై నిర్లక్ష్యంగా మాట్లాడడం వల్ల మిగిలిన మంత్రులు, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చూడండి..