నివర్ తుపానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం నేత వరపుల రాజా డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం జె. అన్నవరం, రమణయ్యపేటలో పంట పొలాలను పరిశీలించిన ఆయనకు.. రైతులు తమ బాధలను విన్నవించుకున్నారు. ప్రభుత్వాధికారులు ఇంతవరకు తమ వద్దకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పైరుకు మొలకలు రావడంతో..రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: రైతులను ఆదుకోవాలని తెదేపా నిరసన ర్యాలీ