ప్రభుత్వం కావాలని కృత్రిమ ఇసుక కొరత సృష్టించి వైకాపా నాయకుల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని మాజీమంత్రి చినరాజప్ప అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడితే నలుగురికి మాత్రమే పరిహారం ప్రకటించారని విమర్శించారు. ప్రభుత్వం కావాలని కృత్రిమ ఇసుక కొరత సృష్టించి వైకాపా నాయకుల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని అన్నారు. మరో 5 నెలలు నిర్మాణాలు పూర్తిచేస్తే రాజధాని అమరావతి ఇప్పటికి ఓ రూపు వచ్చేదని... కానీ ప్రభుత్వం కావాలనే అమరావతి నిర్మాణాలను నిలిపేసిందని ఆరోపించారు. ప్రభుత్వానికి అధికారులను బదిలీ చేసే అధికారం ఉన్నా... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ తీరు సరికాదన్నారు.
ఇదీ చూడండి: సీఎస్ బదిలీపై భాజపా నేతల మండిపాటు