ETV Bharat / state

'సింహం ప్రతిమలు అదృశ్యమైతే ఈవో కప్పిపుచ్చుతున్నారు' - వైసీపీ ప్రభుత్వంపై చినరాజప్ప కామెంట్స్

దేవాలయాలు, దళితులపై వరుసగా జరుగుతున్న దాడులు చూస్తుంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? అనే అనుమానం వస్తుందని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు. వరదలతో రైతులు నష్టపోతే మంత్రులు వారిని పట్టించుకోకుండా తెదేపా విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.

Tdp leader chinarajappa
Tdp leader chinarajappa
author img

By

Published : Sep 16, 2020, 5:09 PM IST

Updated : Sep 16, 2020, 11:01 PM IST

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని, రూల్ ఆఫ్​ లా అసలు ఉందా? అనేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఉందని మాజీ మంత్రి చిన రాజప్ప విమర్శించారు. వైకాపా పాలనపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా పని చేస్తుందని విమర్శించారు.

తెదేపా అధినేత చంద్రబాబుపై విమర్శలు చేయడమే ధ్యేయంగా జగన్ పాలన ఉందని రాజప్ప అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలు, దళితుల పట్ల వైకాపా ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉందని రాజప్ప ఆరోపించారు. విజయవాడ దుర్గగుడిలో సింహాల ప్రతిమలు చోరీ ఘటనను కప్పిపుచ్చేందుకు ఈవో కట్టుకథలు చెబుతున్నారని విమర్శించారు. అమరావతిపై తప్పుడు ప్రచారం చేసేందుకు కేసుల పేరుతో దుర్మార్గపు చర్యలకు పూనుకున్నారని ఆరోపించారు.

మంత్రి కన్నబాబు రైతుల సమస్యలు పక్కనబెట్టి చంద్రబాబును విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చినరాజప్ప మండిపడ్డారు. వరదలతో రైతులు నష్టపోతే రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : దుర్గమ్మ వెండి రథంలోని మూడు సింహాలు ఎవరు తీసుకెళ్లినట్టు?

Last Updated : Sep 16, 2020, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.