పలువురు వేధింపులకు గురి చేస్తున్నారనే కారణంతో మనస్తాపానికి గురై రాజమహేంద్రవరంలోని బొమ్మూరుకు చెందిన 32 ఏళ్ల వ్యక్తి అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట 1వ తేదీన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు నలుగురు సభ్యులతో నిజనిర్ధరణ కమిటీని నియమించారు. బాధిత కుటుంబాన్ని కలిసి వాస్తవ నివేదికను సోమవారం అందజేయాలని చంద్రబాబు ఆదేశించారు. కమిటీ సభ్యులుగా తెదేపా అధికార ప్రతినిధి నాగుల్ మీరా, గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ మహ్మద్ నసీర్, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎం.డీ.హిదాయత్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి మహమ్మద్ నజీర్‌లను నియమించారు.
ఇదీచదవండి