మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ప్రయోజనాలు కలిగే విధంగా పనులు చేపట్టాలని.. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సూచించారు. అంబాజీపేట మండలం చిరతపూడి గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ పనుల ద్వారా చెరువులు, మురుగు, పంట కాలువలు, పంట బొధెల్లో పూడిక తీయడం ద్వారా భుగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... 'వృద్ధాప్య పింఛన్లు పెంచుతామని మాటిచ్చారు.. అమలు చేయండి'