తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లి లంక భూమిలో అక్రమ మట్టి తవ్వకాలను తహసీల్దార్ మృత్యుంజయరావు అడ్డుకున్నారు. ఈ ఘటనలో మూడు లారీలు, రెండు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి పనుల కోసం మట్టి అవసరం అని తీసుకున్న అనుమతుల గడువు గతనెల 26న పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. అయినా నిర్వాహకులు అక్రమంగా మట్టి తీస్తున్నారని దాడి చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఇదీ చదవండీ.. కట్టేశామనిపిస్తే.. కొట్టుకుపోయింది..!