ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ప్రాణగండం ఉన్నట్లుగా... ఓ ముల్లా చెప్పారంటూ.. భాజపా నేత స్వామి పరిపూర్ణానంద ఆరోపించారు. ఆ ముల్లాకు సంబంధించిన ఆడియో టేప్ ఇదే అంటూ..తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో ఓ ఆడియో ఫైల్ ను వినిపించారు. కేంద్ర నిఘా సంస్థలు విచారణ చేయాలన్నారు. అలాగే.. పిఠాపురంలో విగ్రహాల ధ్వంసంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. మార్చి 1న పిఠాపురంలో 30 వేల మందితో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. అప్పటిలోగా విగ్రహధ్వంసం ఘటనపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన తీవ్రం చేస్తామన్నారు.
ఇవీ చదవండి: