ETV Bharat / state

కొవిడ్ కేర్ సెంటర్​గా సుబ్బమ్మ ఆసుపత్రి - కొవిడ్ కేర్ సెంటర్​గా సుబ్బమ్మ ఆసుపత్రి వార్తలు

తూర్పుగోదావరి జిల్లా మోరిపోడులోని సుబ్బమ్మ ఆసుపత్రిని కొవిడ్ కేర్ సెంటర్​గా ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 20న వైద్య సేవలు ప్రారంభం కానుండగా..అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Subbamma Hospital as covid Care Center at rajolu
కొవిడ్ కేర్ సెంటర్​గా సుబ్బమ్మ ఆసుపత్రి
author img

By

Published : May 14, 2021, 5:53 PM IST

కొవిడ్​తో బాధపడుతున్న రాజోలు నియోజకవర్గ ప్రజలకు మోరిపోడులోని సుబ్బమ్మ ఆసుపత్రిని కొవిడ్ కేర్ సెంటర్​గా మార్చటానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో 120 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిలో అపోలో సహకారంతో టెలీమెడిసిన్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

రోగులకు ఆక్సిజన్ ఇబ్బందులు తలెత్తకుండా 150 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, 20 ఈసీజీ యంత్రాలు, బీపీ, ఇతర వైద్య పరికరాలు ఇప్పటికే అమెరికా నుంతి దిల్లీకి చేరుకున్నాయి. గ్రామానికి చెందిన స్మార్ట్ విలేజ్ వ్యవస్థాపకుడు సాల్మన్ డార్విన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈనెల 20 నుంచి వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి.

ఇదీచదవండి: సరిహద్దులో మారని తెలంగాణ పోలీసుల తీరు.. వెనక్కి వెళ్తున్న అంబులెన్సులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.