తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పల్లిపాలెం గ్రామం సముద్రపు పోటుకు గురి అవుతున్న కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తెలిపారు. అంతర్వేది పల్లిపాలెం మూడు రోజులుగా సముద్రపు పోటుకు గురికావడం కారణంగా.. ముంపు బారిన పడ్డ 60 కుటుంబాలు తుఫాను షెల్టర్ భవనంలో ఆశ్రయం పొందుతున్నారు. వారిని సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ పలకరించారు. గ్రామం నుంచి ముంపు నీరు పూర్తిగా తొలగిపోయే వరకు బాధితులకు భోజన వసతి కల్పిస్తామని, అవసరమైన వైద్య సహాయం అందిస్తామని తెలిపారు. స్థానిక శాసన సభ్యుడు రాపాక వరప్రసాదరావు బాధితులను పరామర్శించారు.
బాధితులను పరామర్శించిన సబ్ కలెక్టర్
అంతర్వేది పల్లిపాలెం బాధితులను అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ పరామర్శించారు. సముద్రపు పోటుకు గురికావడం కారణంగా.. ముంపు బారిన పడ్డ 60 కుటుంబాలు తుఫాను షెల్టర్ భవనంలో ఆశ్రయం పొందుతున్నవారికి అందుతున్న సహాయంపై ఆరా తీశారు.
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పల్లిపాలెం గ్రామం సముద్రపు పోటుకు గురి అవుతున్న కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ తెలిపారు. అంతర్వేది పల్లిపాలెం మూడు రోజులుగా సముద్రపు పోటుకు గురికావడం కారణంగా.. ముంపు బారిన పడ్డ 60 కుటుంబాలు తుఫాను షెల్టర్ భవనంలో ఆశ్రయం పొందుతున్నారు. వారిని సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ పలకరించారు. గ్రామం నుంచి ముంపు నీరు పూర్తిగా తొలగిపోయే వరకు బాధితులకు భోజన వసతి కల్పిస్తామని, అవసరమైన వైద్య సహాయం అందిస్తామని తెలిపారు. స్థానిక శాసన సభ్యుడు రాపాక వరప్రసాదరావు బాధితులను పరామర్శించారు.
TAGGED:
సముద్రపు పోటు తాజా వార్తలు