తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారిపై విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రతీఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని నినాదాలు చేశారు. జాతీయ రహదారి విభాగం అధికారులు... స్థానిక చైతన్య పాఠశాల విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకొని వాహన చోదకులకు నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. కళా వెంకటరావు సెంటర్లో హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాహనదారులను ఆపి... విద్యార్థులు గులాబీ పూలు ఇచ్చి అవగాహన కల్పించారు. కార్లలో సీటు బెల్ట్ లేకుండా ప్రయాణాలు చేసే వారిని ఆపి... సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: కడపలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు