కేంద్రపాలిత ప్రాంతం యానాం నుంచి పుదుచ్చేరి వెళ్లి ఇరుక్కుపోయిన విద్యార్థులు, ఉద్యోగులు... ఎట్టకేలకు ఇళ్లకు చేరుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించటంతో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు చొరవతో... వీరంతా యానాం చేరుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మాజీఉద్యోగులు... మొత్తం 25 మంది యానాం వచ్చారు. వీరందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హోమ్ క్వారంటైన్ లో 14 రోజులు ఉండాలని సూచించారు. యానాంలో ఉన్న పుదుచ్చేరి వాసులను తరలించేందుకు డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది చదవండి రంగులు చల్లుకుని నృత్యం చేసిన అర్చకులు ఎందుకంటే...