ETV Bharat / state

Student Letter to Teachers: మద్యం తాగుతా.. సిగరెట్‌ కాలుస్తా..! - Student letter to teachers telling that he is drinkin alcohol

Student letter to teachers: ‘నేను రోజూ క్వార్టర్‌ మద్యం తాగుతా.. పాఠశాలకు సమీపంలోని ఒక దుకాణంలో సిగరెట్లు కొనుక్కుని కాల్చుతున్నా'.. అని ఓ విద్యార్థి.. తన ఉపాధ్యాయులకు లేఖ రాశాడు. దీన్ని చూసిన ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఖంగుతిన్న ఘటన.. తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది

Student letter to teachers telling that he is drinking alcohol in p.gannavaram
ఉపాధ్యాయులకు తొమ్మిదో తరగతి విద్యార్థి లేఖ
author img

By

Published : Mar 28, 2022, 10:37 AM IST

Student letter to teachers: తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి మద్యం తాగి పాఠశాలకు వచ్చిన వైనాన్ని ఉపాధ్యాయులు గుర్తించారు. ఆ విద్యార్థి తండ్రిని పిలిపించి, మీ అబ్బాయి ప్రవర్తన బాగా లేదని చెప్పారు. ఇంటి వద్ద మేం చెబుతున్నా వినడం లేదు.. మీరైనా చెప్పండంటూ ఆయన వెళ్లిపోయాడు. దీనిపై ఆ విద్యార్థి రాసిన లేఖను చూసి ఉపాధ్యాయులు విస్మయం చెందారు.

‘నేను రోజూ క్వార్టర్‌ మద్యం తాగుతా.. పాఠశాలకు సమీపంలోని ఒక దుకాణంలో సిగరెట్లు కొనుక్కుని కాల్చుతున్నా. పి.గన్నవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మద్యం కొనుక్కుంటున్నా. ఆ డబ్బుల కోసం ఇటుక బట్టీలో పనికి వెళ్తున్నా.. ఇక మీదట ఇలా చేయను..’ -లేఖలో విద్యార్థి

పాఠశాలలో అయిదుగురు వరకు విద్యార్థులు మద్యానికి అలవాటుపడ్డారని, అలాంటి వారికి మంచి మాటలు చెబుతుంటే వారి తల్లిదండ్రులు వెనకేసుకొస్తున్నారని ఓ ఉపాధ్యాయుడు వాపోయారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.