తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని ముంగండ గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి వంక చంద్రశ్రీ వీర వెంకట పవన్ గణేష్.. ఇటీవల అదృశ్యమయ్యాడు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణేష్ 10వ తరగతి చదివేవాడు. సాయంత్రం ట్యూషన్ కోసం సైకిల్‌పై వెళ్లాడు. మంగళవారం రాత్రి 11 గంటల వరకు కుమారుడు తిరిగి రాకపోవటంపై తల్లిదండ్రులు రాత్రి అంతా గాలించారు. విద్యార్థి ఆచూకీ లభ్యం కాని పరిస్థితుల్లో ఆవేదన చెందారు. స్థానిక మంచినీటి చెరువు దగ్గర సైకిలు, చెప్పులు ఉండటంతో చెరువులో గాలించారు. చెరువులో పవన్ గణేష్ మృతదేహం లభ్యమవడాన్ని చూసి.. విద్యార్థి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ కేఎస్వీ ప్రసాద్ అనుమానాస్పద కేసుగా నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:
రైల్వేస్టేషన్ లిఫ్ట్‌లో చిక్కుకున్న యువకులు...రక్షించిన సిబ్బంది