ETV Bharat / state

ముంపులోనే పంట.. సాయం కోసం ఎదురు చూపుల్లో రైతన్న - తూర్పు గోదావరి రైతుల కష్టాలు

భీకర వరదలతో తీరాన్ని అతలాకుతలం చేసిన గోదారమ్మ.. పరివాహక ప్రాంత పంటలను ముంచేసింది. తూర్పు గోదావరి జిల్లాలో విలీన మండలాల నుంచి కోనసీమ వరకూ వివిధ రకాల పంటలు వరదలకు దెబ్బతిని పోయాయి. ఇప్పటికీ కొన్నిచోట్ల పంటలు ముంపులోనే ఉన్నాయి. అధికార యంత్రాంగం పంట నష్టం అంచనాలను చేపట్టినా పొలాల్లో నీరు నిల్వ ఉన్న కారణంగా.. ఇంకా లెక్కలు ఖరారు కాలేదు.

story on floods at east godavari
ముంపులోనే పంట
author img

By

Published : Sep 5, 2020, 3:19 PM IST

గోదావరి వరదలు సృష్టించిన విలయం తూర్పు గోదావరి జిల్లాలో రైతులను కోలుకోలేని దెబ్బ తీసింది. మన్యం నుంచి లోతట్టు ప్రాంతాల్లోని లంకల వరకూ పంటంతా జలదిగ్భంధంలో చిక్కుకుపోయింది. వరితో పాటు వివిధ రకాల ఉద్యాన పంటలు రోజుల తరబడి నీటిలో మగ్గిపోయాయి. ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్ ‌పురం, దేవీపట్నం, సీతానగరం, రాజమహేంద్రవరం మండలాల్లోని పంటంతా నీటిలో నానిపోయి కుళ్లిపోయింది. ఇటు కోనసీమలో పంటనష్టం తీవ్రంగా ఉంది. ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, పి.గన్నవరం, మామిడికుదురు, రాజోలు, సఖినేటిపల్లి, ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల్లోని లంకలు, తీర ప్రాంత పంటపొలాలను భారీ వరద ముంచేసింది.

వరదనీటిలో 15 రోజుల పాటు పంట ఉండిపోవడంతో పూర్తిగా కుళ్లిపోయాయి. కోనసీమలోని లోతట్టు ప్రాంతాల్లో పంటలు ఇంకా నీటిలోనే తేలుతున్నాయి. దీంతో వరి పండించే రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ చేజారే పరిస్థితి నెలకొంది. కూరగాయలు, ఇతర పంటలకూ రైతులులక్షల్లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మండల, గ్రామ స్థాయిలో బృందాలు పంట నష్టం అంచనా వేస్తున్నాయి. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బంది పంటనష్టం అంచనాల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకూ పంట నష్టంపై ఒక అంచనాకు వచ్చామని అధికారులు చెబుతున్నారు.

ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద వరికి హెక్టారుకి రూ.15వేలు, మొక్కజొన్నకు రూ.12,500, పత్తికి రూ.10వేలు ఇవ్వనున్నారు. అలాగే ఉద్యాన పంటల్లో అరటికి హెక్టారుకి రూ. 25వేలు, కూరగాయలకు రూ.15వేలు అందించనున్నారు. పంట నష్టంపై మొత్తం లెక్కలు తేలాక ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించనున్నారు.

ఇదీ చదవండి:

అది నగదు బదిలీ కాదు.. రైతుల మెడకు కట్టే ఉరితాళ్లు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.