తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజవర్గ పరిధిలోని తాళ్ళరేవు, ఐ పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన మండలాలతోపాటు యానాంలోనూ చేపల వేటను అధికారులు నిషేధించారు. సావిత్రి నగర్ మినీ హార్బర్, భైరవపాలెం గోదావరి పాయ ఒడ్డుకు బోట్లను మత్స్యకారులు ఓడ్డుకు చేేర్చారు. గోదావరి నదీ పాయల్లో వేటే వాళ్ల రోజువారి జీవనాధారం. ఈ క్రమంలో 61 రోజులపాటు పనిలేకుండా కుటుంబాలను నెట్టుకు రావడం కష్టమే. అప్పులు చేసి మరీ రోజులు నెట్టుకురావాల్సి ఉంటుంది. అయితే వేట నిషేధ కాలానికి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10వేలు ప్రకటించింది. అవి ఎప్పటికీ అందుతాయో అనేది అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుందని మత్స్యకారులు అంటున్నారు.
61 రోజులపాటు నిషేధం
సముద్రజలాల్లో మత్స్య సంపద అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 61 రోజులపాటు సముద్రజలాల్లో వేట నిషేధం అమల్లోకి తీసుకొచ్చింది. ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ వేట నిషేధిస్తారు. ఈ సమయంలో తగిన ఆహారం తీసుకుని బలంగా తయారై గుడ్లుపెట్టి ఒక్కో చేప పెద్దసంఖ్యలో పిల్లలను కంటుంది. విరామం వేళ ఇబ్బంది పడకుండా మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేలు వేట నిషేధ భృతి ప్రభుత్వం అందిస్తుంది.
ఇదీ చదవండి:
తిరుపతి ఉపపోరు: మైకులు మూగబోయాయి.. మిగిలింది ప్రజా తీర్పే..!