ఈ నెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా... పుదుచ్చేరి ప్రభుత్వం ఆటల పోటీలు నిర్వహించింది. ఈ పోటీల్లో మత్స్యకార కుటుంబాలకు చెందిన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. యానాం మత్స్యశాఖ సంచాలకుల ఆధ్వర్యంలో 30 ఏళ్లలోపు యువకులకు ఈత పోటీలు నిర్వహించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థినులు రంగవల్లుల పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు 21న నిర్వహించే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో బహుమతులు ప్రదానం చేయనున్నారు.
ఇదీ చదవండి: సాగరతీరంలో... భారత్-అమెరికా సంయుక్త విన్యాసాలు