తూర్పు గోదావరి జిల్లాలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పర్యటించారు. కాకినాడ, బిక్కవోలు, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లను ఆయన పరిశీలించారు. స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించారు. కొవిడ్ సమయంలో రైల్వేలు విశేష సేవలు అందిచాయన్నారు. 1300 మిలియన్ టన్నుల ఎగుమతులు జరిగినట్టు తెలిపారు.
రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య గోదావరి వంతెనపై 40 ఏళ్ల నాటి పట్టాలు తొలగించి...కొత్తవి అమర్చినట్టు గజానన్ మాల్యా తెలిపారు. పలు రైల్వే పనుల్ని విజయవంతంగా పూర్తి చేసినట్టు చెప్పారు. నిడదవోలు-భీమవరం-నర్సాపురం లైను పనులు వచ్చే ఏడాదినాటికి పూర్తవుతాయని జీఎం చెప్పారు. కోటిపల్లి-నర్సాపురం కోనసీమ రైల్వే లైను పనులకు నిధుల కొరత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చకపోవడం వల్ల పనులు నెమ్మదించాయని తెలిపారు. కాకినాడ ఎంపీ వంగా గీత, రాజమహేంద్రవరం ఎంపీ భరత్ రామ్... జీఎం మాల్యాను కలిసి పలు రైల్వే ప్రాజెక్ట్లు, మౌలిక వసతుల కల్పనపై వినతిపత్రాలు అందజేశారు.
ఇదీ చదవండి