వరదల కారణంగా తూర్పుగోదావరి పి.గన్నవరం కే.ఏనుగుపల్లి లంకలో శ్రీనివాసరావు పాముకాటుకు గురయ్యాడు. ఇంటి చుట్టూ వరద చేరింది. తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన పాము శ్రీనివాసరావును కాటేసింది. గన్నవరం ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వరదల కారణంగా గ్రామాల్లోకి పాములు ప్రవేశిస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి:కట్టుకున్న భార్య.. కళ్ల ముందే లోకాన్ని వీడిన వేళ...!