సర్ ఆర్ధర్ కాటన్ను రాజకీయ నాయకుడిగా భావించి ఆయన విగ్రహానికి ముసుగు వేయడం దారుణమని తూర్పుగోదావరి జిల్లా పీ. గన్నవరం వాసులు అంటున్నారు. స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా గ్రామంలో ఉన్న కాటన్ విగ్రహానికి 4 నెలల క్రితం ముసుగు వేశారు.
రాజకీయ నాయకుడు కాకపోయినా ముసుగు వేయడమే విచిత్రం అనుకుంటే.. ఎన్నికలు వాయిదా పడినా ఇప్పటికీ ముసుగు తీయకపోడం అన్యాయమని స్థానికులు వాపోతున్నారు. ఇది తప్పిదమని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ముసుగు తొలగించాలని అధికారులను కోరుతున్నారు.