విజయనగరం ప్రాంతానికి చెందిన జయలక్ష్మికి అన్నవరం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈమె గత ఏడాది ఆగస్టు 31 న అదృశ్యం అవ్వడంతో కుటుంబ సభ్యులు అన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో అన్నవరం ఎస్సై గా ఉన్న మురళీమోహన్ కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసు గురించి పట్టించుకోకపోవడంతో పెండింగ్ లో ఉండిపోయింది. దీనిపై స్టేషన్ లో ప్రస్తుత పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. అదృశ్యమైన ఆ వివాహిత అదే రోజున ఆత్మహత్య కు పాల్పడినట్లు గుర్తించారు.
అప్పట్లో రావికంపాడు - అన్నవరం రైల్వే స్టేషన్ ల మధ్య మృత దేహం లభ్యం కావడంతో తుని జీఆర్పీ పోలీసులు గుర్తు తెలియని మృత దేహంగా కేసు నమోదు చేశారు. మూడు రోజుల తర్వాత రైల్వే పోలీసులు ఖననం చేశారు. ప్రస్తుత దర్యాప్తులో అప్పట్లో అదృశ్యమైన వివాహితే ఆత్మహత్య కు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసు లో మృతురాలు అదృశ్యం అయిన తర్వాత దర్యాప్తు చేయడం లో ఆలసత్వం వహించడం, లా అండ్ ఆర్డర్, జీఆర్పీ పోలీసులు మధ్య సమన్వయం లేకపోవడంతో అప్పట్లో అన్నవరం ఎస్సై గా ఉన్న మురళీమోహన్ ను సస్పెండ్ చేయడంతో పాటు, అప్పటి సీఐ సన్యాసిరావుకు ఛార్జి మెమో జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ధ్రువీకరించారు.
ఇదీ చదవండి: